: ఆదర్శ రైతుల్లో ఆటో డ్రైవర్లున్నారట... అందుకే వ్యవస్థనే రద్దు చేశామంటున్న పోచారం!
పల్లె సీమల్లో రైతులకు సాగుపై మెళుకువలను నేర్పించడంతో పాటు అప్పటికప్పుడు ఏర్పడే సమస్యల పరిష్కారంపై దృష్టి సారించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఆదర్శ రైతు వ్యవస్థ ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఆ వ్యవస్థను రద్దు చేస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇందుకు గల కారణాలను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నిన్న అసెంబ్లీకి తెలిపారు. ‘‘ఆదర్శ రైతుల్లో అత్యధికులు ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లే. నియమ నిబంధనలను తోసిరాజని నియామకాలు జరిగాయి. ఈ కారణంగానే ఆదర్శ రైతు వ్యవస్థను సమూలంగా నిర్మూలించాం’’ అని ఆయన పేర్కొన్నారు.