: విద్యుత్ చార్జీల పెంపుపై ఏపీ అసెంబ్లీలో రగడ... చర్చకు పట్టుబట్టిన వైసీపీ


విద్యుత్ చార్జీల పెంపు ఏపీ అసెంబ్లీలో మరోమారు కాక పుట్టించింది. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మాట్లాడేందుకు అవకాశమివ్వడం లేదని ఆరోపిస్తూ సమావేశాల నుంచి వాకౌట్ చేసిన వైసీపీ, నేటి సమావేశాలకు హాజరైంది. వచ్చీ రాగానే విద్యుత్ చార్జీల పెంపుపై చర్చ కోసం వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే, వైసీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దీంతో ఈ అంశంపై చర్చకు అనుమతించాల్సిందేనని వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. విద్యుత్ చార్జీల పెంపుపై సభా నాయకుడు చంద్రబాబు సభలో ప్రకటన చేస్తారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినా, విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. చర్చకు అనుమతించాల్సిందేనని ప్లకార్డులు చేతబట్టి పోడియం ముందు నిరసనకు దిగారు. దీంతో, రెండు రోజుల పాటు సజావుగా సాగిన సభలో మళ్లీ గందరగోళం నెలకొంది.

  • Loading...

More Telugu News