: వైసీపీకి మరో షాక్!... టీడీపీలో చేరేందుకు ప్రకాశం జడ్పీ చైర్మన్ సన్నాహాలు
వరుస దెబ్బలు తగులుతున్న వైసీపీకి ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బాలాజీ పెద్ద షాక్ నే ఇవ్వనున్నారు. వైసీపీ తరఫున జడ్పీటీసీగా ఎన్నికైన ఆయన, ఈదర హరిబాబు అనర్హతతో అనూహ్యంగా జడ్పీ చైర్మన్ అయ్యారు. విపక్షం గ్రాఫ్ క్రమంగా పడిపోతున్న వైనాన్ని గమనించిన ఆయన, నిన్న నేరుగా అసెంబ్లీకి వచ్చారు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడితో భేటీ అయ్యారు. జడ్పీ చైర్మన్ తో యనమల కొద్దిసేపు చర్చలు జరిపారు. తాను టీడీపీలోకి చేరాలనుకుంటున్నానని, ఎలాగైనా పార్టీ అధినేత చంద్రబాబుతో మాట్లాడాలని బాలాజీ, యనమలను కోరారట. అంతేగాక, అభీష్టాన్ని ఆయన తన లెటర్ హెడ్ పై రాసిచ్చారట. దీనికి సానుకూలంగా స్పందించిన యనమల, తాను చంద్రబాబుతో మాట్లాడతానని చెప్పడమే కాక తనతో టచ్ లో ఉండాలని బాలాజీకి సూచించారట.