: బెంబేలెత్తిస్తున్న బౌల్ట్... రెండో వికెట్ చేజార్చుకున్న సఫారీలు


సొంతగడ్డపై కివీస్ జట్టు ప్రభావం చూపుతోంది. పేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పై న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసురుతున్నారు. దీంతో, దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. కివీస్ లెఫ్టార్మ్ సీమర్ ట్రెంట్ బౌల్ట్ నిప్పులు చెరిగే బంతులతో సఫారీ టాపార్డర్ కు పరీక్ష పెడుతున్నాడు. బౌల్ట్ ధాటికి మరో ఓపెనర్ డి కాక్ (14) కూడా వెనుదిరిగాడు. సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అంతకుముందు, 10 పరుగులు చేసిన ఓపెనర్ ఆమ్లా కూడా బౌల్ట్ బౌలింగ్ లోనే అవుటయ్యాడు. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా 2 వికెట్లకు 34 పరుగులు చేసింది. క్రీజులో డు ప్లెసిస్ (8 బ్యాటింగ్), రూసో (1 బ్యాటింగ్) ఉన్నారు.

  • Loading...

More Telugu News