: దక్షిణ చైనా సముద్రం మీద చైనా హక్కులకు చట్టబద్ధ పునాది లేదు: ఇండోనేషియా అధ్యక్షుడు
దక్షిణ చైనా సముద్రం మీద చైనా హక్కులకు చట్టబద్ధ పునాది లేదని ఇండోనేషియా అధ్యక్షుడు జొకొ విడొడొ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వారం చైనా, జపాన్ దేశాల్లో పర్యటించనున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. గతేడాది అక్టోబర్ లో అధ్యక్ష పదవిని అలంకరించిన విడొడొ తొలుత దక్షిణ చైనా సముద్రంపై దృష్టిపెట్టారు. దీంతో, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు నెలకొన్నప్పుడే అక్కడి దేశాలు వృద్ధిబాటపడతాయని ఆయన పేర్కొన్నారు. కాగా, దక్షిణ చైనా సముద్ర జలాల సరిహద్దులు, ఇతర వివాదాస్పద అంశాలపై పొరుగు దేశాలతో ఏర్పడే సమస్యలపై చైనా, ఇతర దేశాలకు ఇండోనేషియా మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. దక్షిణ చైనా సముద్రంలో అతిపెద్ద దేశం ఇండోనేషియా కావడం విశేషం.