: క్షణాల్లో నెలల బాలుడితో మాయమైన మహిళ
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో నెలల పసికందును క్షణాల్లో మాయం చేసిందో మహిళ. అనారోగ్యం కారణంగా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి ధనలక్ష్మి అనే మహిళ తన ఏడు నెలల కుమారుడి (రవితేజ)తో వచ్చింది. వైద్యపరీక్షల నిమిత్తం వైద్యుడి వద్దకు వెళ్లే క్రమంలో రవితేజను పక్కనే ఉన్న మరో మహిళకు అప్పగించి, లోపలికి వెళ్లింది. పరీక్ష ముగించుకుని బయటకు వచ్చి చూసేసరికి బిడ్డను ఎత్తుకున్న మహిళ కనిపించలేదు. ఆ మహిళ బిడ్డ సహా ఉడాయించిందని భావించిన ధనలక్ష్మి, బిడ్డ కోసం ఎంత గాలించినా ఫలితం లేకపోయింది. మోసపోయిన విషయం గ్రహించి, పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన కొత్తపేట పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.