: 'మన్ కీ బాత్'లో మోదీ చెప్పేవి అబద్ధాలే: వీహెచ్
ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మోదీ చెప్పేవన్నీ అబద్ధాలేనని కాంగ్రెస్ ఎంపీ వీహెచ్ పేర్కొన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, భూసేకరణ చట్టంపై 'మన్ కీ బాత్'లో ప్రధాని అబద్ధాలు చెప్పారని అన్నారు. కార్పొరేట్లకు ప్రయోజనం కల్పించేందుకే భూసేకరణ చట్టం తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. భూములన్నీ అమ్మేస్తే భవిష్యత్ తరాలు ఏమవుతాయని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో ప్రధాని హోదాలో మన్మోహన్ చెప్పారని, దానిని అమలు చేయకుండా ఎన్డీయే దాటవేత ధోరణి అవలంబిస్తోందని ఆయన మండిపడ్డారు.