: అప్పుడే 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు... తట్టుకోలేకపోతున్న చిన్నారులు, వృద్ధులు
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం అంతకంతకూ పెరుగుతోంది. మార్చి నెల కూడా పూర్తి కాలేదు. ఉష్ట్రోగ్రతలు మాత్రం అప్పుడే 40 డిగ్రీలు దాటేశాయి. అనేక చోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువ నమోదవుతున్నాయి. ఇక, సముద్ర తీర ప్రాంతాల్లో అయితే ఉక్కపోత భరించలేకపోతున్నారు. కర్నూలులో అత్యధిక స్థాయిలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవగా, నంద్యాల, నందిగామలో 40, హైదరాబాద్, తిరుపతి, కడప, అనంతపురం, విజయవాడలో 39, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ 38, మచిలీపట్నం, కాకినాడలో 36 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన ఉష్ణోగ్రతల ధాటికి చిన్నారులు, వృద్ధులు తట్టుకోలేకపోతున్నారు.