: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో పేలుళ్ల కలకలం
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం అబ్దుల్లాపూర్ మెట్ లో పేలుళ్లు కలకలం రేపాయి. అబ్దుల్లాపూర్ మెట్ లోని జేఎన్ఎన్ యూఆర్ఎం కాలనీలోని నీటి ట్యాంకు నిర్మాణంలో భాగంగా కాంట్రాక్టర్ డిటోనేటర్లు పేల్చారు. జనావాసాల మధ్య పేలుళ్ల కారణంగా వంద మీటర్ల దూరంలో ఉన్న భవనాలను బండరాళ్లు బలంగా తాకాయి. ఇలా ఎగసిపడిన బండరాళ్లు తగిలి 13 ఏళ్ల బాలికకు తీవ్రగాయాలు కాగా, మరో బాలిక గాయపడింది. దీంతో, ఆ బాలికలను ఆసుపత్రికి తరలించారు. కాగా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా పేలుళ్లు జరపడమేంటని స్థానికులు కాంట్రాక్టరును నిలదీశారు.