: రోజాపై సైఫాబాద్ పీఎస్ లో ఫిర్యాదు
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై హైదరాబాదులోని సైఫాబాదు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దాఖలైంది. రోజా వికలాంగులను కించపరిచారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ మధ్యాహ్నం రోజాపై మంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. తాను తప్పు చేసినట్టు తేలితే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. రోజా దళితుల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీశారని అన్నారు. నీతి, నిజాయతీకి మారుపేరు దళితులు అని మంత్రి ఉద్ఘాటించారు.