: నాపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నీచంగా రాశారు: రోజా
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానల్ ఎండీ రాధాకృష్ణపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విరుచుకుపడ్డారు. తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించి ఆంధ్రజ్యోతిలో రాశారని మండిపడ్డారు. ఓ టీవీ చానల్ మహిళా ప్రతినిధి తనతో మాట్లాడుతూ, మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని ప్రశ్నించారని... దానికి సమాధానంగా ఒకటి హత్య చేయవచ్చని, లేదా రెండోది మానానికి ప్రమాదం సంభవించవచ్చని చెప్పానని అన్నారు. కానీ, ఆ విలేకరిని "నువ్వు రేప్ చేస్తావా?" అని తాను అడిగినట్టు రాధాకృష్ణ దీనిపై నీచంగా రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాట్లాడింది ఓ మహిళా విలేకరితో అన్న విషయాన్ని కూడా వదిలేసి ఇంత నీచంగా రాస్తారా? అంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.