: తెలుగు రాష్ట్రాలకు ‘వెలుగు’ కబురు... ఢిల్లీ సర్కారుకిచ్చిన విద్యుత్ ను తిరిగిచ్చిన కేంద్రం
రాష్ట్ర విభజన తర్వాత నిధుల లేమితో పాటు విద్యుత్ కొరతతోనూ సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ‘వెలుగు’ కబురు పంపింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఉమ్మడి రాష్ట్రం ఇచ్చిన విద్యుత్తును తిరిగి సర్దుబాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఢిల్లీ సర్కారు ఇచ్చిన విద్యుత్తును ఏపీ, తెలంగాణలకు ఇచ్చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఏపీకి 304, తెలంగాణకు 222 మెగావాట్ల విద్యుత్తును సర్దుబాటు చేయాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి కేంద్రం దిశానిర్దేశం చేసింది.