: ఐఏఎస్ అధికారి రవి మృతిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశం
ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన కర్ణాటకు చెందిన యువ ఐఏఎస్ అధికారి డీకే రవి మృతిపై సీబీఐ దర్యాప్తుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓ ప్రకటన చేశారు. ఈ కేసును సీబీఐకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ నెల 16న రవి తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారు. దాంతో ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని అతని కుటుంబం, పలువురి నుంచి డిమాండ్లు వచ్చాయి. దాంతో ఘటనపై నిష్పాక్షికంగా విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రవి భార్యకు లేఖ రాశారు.