: ఎమ్మెల్యే రోజాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు


వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై ఏపీ స్పీకర్ కు టీడీపీ ఎమ్మెల్యే అనిత సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. మంత్రి పీతల సుజాత పట్ల ఆమె అనుచితంగా వ్యవహరించారంటూ నోటీసులో పేర్కొన్నారు. ఈ క్రమంలో రోజాపై సస్పెన్షన్ వేటు వేయాలని స్పీకర్ కోడెలను కోరారు. అంతేగాక రోజాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ఘర్షణ సందర్భంగా జరిగిన సంఘటనలపై ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలో రోజా సంజ్ఞలు చేయడం, కాలెత్తి చూపడం వంటి సన్నివేశాలు వివాదం రేపాయి. మంత్రి సుజాతనుద్దేశించే తానలా చేశానని రోజా కూడా మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News