: పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగిచ్చేందుకు సైఫ్ సుముఖమే: కరీనాకపూర్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోబోతోందంటూ వస్తున్న వార్తలపై అతని భార్య, నటి కరీనా కపూర్ ఖాన్ స్పందించింది. ఆ అవార్డుతో సైఫ్ ను సన్మానించారని, దానిని తిరిగి ఇచ్చేందుకు సముఖంగానే ఉన్నాడని అంటోంది. "నిజానికి అదొక జాతీయ గౌరవం. అవార్డు ఇచ్చేముందు వారు తప్పకుండా సదరు వ్యక్తి గురించి ఆరా తీస్తారు. హోటల్ లో ఆరోజు జరిగిన సైఫ్ ఘర్షణ గురించి చర్చించాలనుకుంటే సరే. ఏ విధంగా ఈ గొడవ పద్మశ్రీపై ప్రభావం చూపుతుందో మాట్లాడవచ్చు. నాకు తెలిసినంతవరకు ఇంతవరకు సైఫ్ తో అవార్డు విషయంపై నేను చర్చించలేదు. దానిపై తను చాలా రిలాక్స్డ్ గా ఉన్నాడు. తిరిగిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు" అని బెబో (కరీనా ముద్దుపేరు) చెప్పుకొచ్చింది. ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ పై ముంబయి కోర్టు అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలో సైఫ్ పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలంటూ వచ్చిన డిమాండ్ ను కేంద్రం పరిశీలించనుందని గతేడాది ఆగస్టులో ఓ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా తెలిసింది. ఫిబ్రవరి, 2012లో ముంబయి, కొలాబాలోని ఓ హోటల్ లో దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వ్యాపారవేత్త, అతని బంధువుపై సైఫ్ దాడి చేశాడు. ఆ సమయంలో ఆ వ్యాపారవేత్త ముక్కు నుంచి రక్తం కూడా వచ్చింది. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.