: ముద్దాయిని ఆసుపత్రికి తీసుకెళ్తూ... 'కోరిక' తీర్చుకున్న పోలీసులు... రైడింగ్ లో బుక్!


జార్ఖండ్ లోని ఒక జైలు నుంచి ఒక ముద్దాయిని ఆసుపత్రికి తీసుకెళ్ళాల్సిన నలుగురు కానిస్టేబుళ్లు ఏకంగా పక్క రాష్ట్రానికి వెళ్లారు. ఎందుకో తెలుసా? తమ లైంగిక కోరికలు తీర్చుకునేందుకు! పశ్చిమ బెంగాల్ లోని రెడ్ లైట్ ప్రాంతంగా పేరున్న అసన్సోల్ ప్రాంతంలో రైడింగ్ చేసిన బెంగాల్ పోలీసులు అక్కడి వ్యక్తులను చూసి అవాక్కయ్యారు. వీరు వెళ్ళాల్సిన రూట్ నుంచి 206 కిలోమీటర్లు అధికంగా ప్రయాణించి మరీ అసన్సోల్ వచ్చినట్టు గుర్తించారు. పోలీసులు వారి పనిలో వారుండగా, హత్యారోపణలు ఎదుర్కొంటున్న ఖైదీ తప్పించుకొని తిన్నగా జైలుకు వెళ్ళాడట. ఈ నలుగురు కానిస్టేబుళ్ళను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించినట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News