: నేడు వైసీపీ శాసనసభాపక్ష సమావేశం... అసెంబ్లీకి హాజరవుతుందా?


శాసన సభలో చర్చ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తూ అసెంబ్లీ సమావేశాలను దాదాపుగా బహిష్కరించిన ప్రతిపక్ష వైసీపీ నేడు కీలక భేటీని నిర్వహించనుంది. పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్ లో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో మరికొద్దిసేపట్లో ఆ పార్టీ శాసనసభాపక్షం ప్రత్యేకంగా భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి తదుపరి వ్యూహాన్ని ఈ భేటీలో నిర్ణయించనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News