: సింగపూర్ నవ వైతాళికుడు లీ కున్ యూ అస్తమయం... న్యుమోనియా కారణంగా కన్నుమూత!


సింగపూర్ నవ వైతాళికుడిగా పేరుగాంచిన సింగపూర్ మాజీ ప్రధాని లీ కున్ యూ ఇక లేరు. కొంతకాలంగా న్యుమోనియా కారణంగా ఇబ్బందిపడుతున్న ఆయన నేటి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. స్వతంత్ర సింగపూర్ కు తొలి ప్రధానిగా 1959లో బాధ్యతలు చేపట్టిన ఆయన 1990 దాకా ఆ పదవిలో కొనసాగారు. మూడు దశాబ్దాలకు పైగా ప్రధానిగా పనిచేసిన ఆయన సింగపూర్ ఆధునిక పితామహుడిగా ఖ్యాతిగాంచారు. పీపుల్స్ యాక్షన్ పార్టీ సహ వ్యవస్థాపకుడైన లీ కున్ యూ, సింగపూర్ అన్ని రంగాల్లో విశేష వృద్ధి సాధించేందుకు ఎనలేని కృషి చేశారు. న్యుమోనియా కారణంగా గత నెల 5న ఆయన చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే ఆయన నేటి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అప్పటిదాకా అవినీతి కూపంలో కూరుకుపోయిన సింగపూర్ ను అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దడమే కాక ప్రపంచంలోని మెరుగైన దేశాల్లో ఒకటిగా ఆ దేశాన్ని తీర్చిదిద్దేందుకు ఆయన అవిశ్రాంత కృషి చేశారు.

  • Loading...

More Telugu News