: బీజేపీ తీర్థం పుచ్చుకున్న నేదురుమల్లి తనయుడు రామ్ కుమార్


మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత నేదురుమల్లి జనార్థనరెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి నేడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. రామ్ కుమార్ తో పాటు ఆయన అనుచరులు కూడా భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, విభజన సందర్భంగా ఇచ్చిన హామీలన్నంటినీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. మరో 15 ఏళ్లపాటు మోదీనే అధికారంలో ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News