: 100 మందితో హిట్ లిస్ట్ విడుదల చేసిన ఐఎస్!


ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) తాజాగా, అమెరికా మిలిటరీ సిబ్బందిలో తాము చంపాల్సిన వారంటూ ఓ 100 మందితో హిట్ లిస్ట్ విడుదల చేసింది. అమెరికాలో ఉంటున్న తమ 'సోదరులు' ఆ జాబితాలో ఉన్న వ్యక్తులను చంపాలని పిలుపునిచ్చింది. హిట్ లిస్టులో సదరు అమెరికన్ల ఫొటోలు, చిరునామాలను కూడా పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ హ్యాకింగ్ డివిజన్ పేరిట ఈ మేరకు ఆన్ లైన్ లో పోస్టు చేశారు. దీనిపై అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ స్పందించింది. ఓ అధికారి మాట్లాడుతూ, ఈ సమాచారం నిజమైనదో కాదో చెప్పలేమన్నారు. కానీ, దీనిని పరిశీలిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News