: భూసేకరణ బిల్లు రైతులకు వ్యతిరేకం కాదు... 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ


కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన భూసేకరణ బిల్లు రైతులకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గతంలో రూపొందించిన చట్టానికి కొన్ని సవరణలు చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కొద్దిసేపటి క్రితం ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమైన 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ రైతు సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడారు. భూసేకరణ వల్ల ఏ ఒక్క రైతు కూడా ఇబ్బందుల పాలు కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అకాల వర్షాలు పలు రాష్ట్రాల్లోని రైతులను ముంచేశాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, నివేదికలు తెప్పించుకుని, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రకటించారు. 'మన్ కీ బాత్' లో భాగంగా పలు సమస్యలపై లేఖాస్త్రాలు సంధించిన రైతులకు మోదీ అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News