: మాల్ ప్రాక్టీస్ పై నితీశ్ గరం గరం... 900 మంది అరెస్ట్, 552 మంది విద్యార్థుల డిబార్!
బీహార్ పదో తరగతి పరీక్షల్లో భాగంగా మొన్న జరిగిన మాల్ ప్రాక్టీస్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అదేదో ఉత్సవం అన్నట్టుగా జరిగిన ఈ వ్యవహారంపై నిన్నటిదాకా నోరు మెదపని నితీశ్ కుమార్ కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. సర్కారు నుంచి ఆదేశాలు రాగానే మెరుపు దాడులు చేసిన ఆ రాష్ట్ర అధికారులు నిన్న ఒక్క రోజే కాపీ కొడుతున్న 552 మంది విద్యార్థులను డిబార్ చేశారు. అంతేగాక, మొన్న మిద్దె గోడలు పాకి కాపీలు అందించి రాష్ట్ర పరువును గంగలో కలిపిన ఘటనకు బాధ్యులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిపి మొత్తం 900 మందిని అరెస్ట్ చేశారు. ఇక, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డ విద్యార్థుల నుంచి నిన్న ఒక్క రోజే రూ. 13 లక్షల మేర జరిమానాను వసూలు చేశారు.