: తెలంగాణకు 'రూరల్ ఎలక్ట్రిఫికేషన్' సాయం రూ.24 వేల కోట్లు ... కేసీఆర్ సమక్షంలో కుదిరిన ఒప్పదం
తెలంగాణకు మన్మథ నామ ఉగాది నిధుల మూటను మోసుకొచ్చింది. రాష్ట్ర విభజనతో విద్యుత్ కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణలో విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేసీఆర్ సర్కారు భారీ కసరత్తు చేస్తోంది. దీనికి జీవం పోస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ 'రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్' భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. తెలంగాణకు రూ.24 వేల కోట్లను ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో సీఎం కేసీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నిధులన్నింటినీ ప్రతిపాదిత 6,200 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుకు ఖర్చు చేయనున్నట్లు తెలంగాణ సర్కారు ప్రకటించింది.