: మే నెలలో నవ్యాంధ్ర రాజధానికి శంకుస్థాపన... సమయం, స్థలంపై చంద్రబాబు కసరత్తు


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి మే నెలలో శంకుస్థాపన జరగనుంది. ఈ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ కు తుది మెరుగులు దిద్దుతున్న ఆయన ఈ నెల 29న సింగపూర్ పర్యటనకు వెళుతున్నారు. పర్యటనలో భాగంగా రాజధాని నిర్మాణంపై సింగపూర్ ప్రభుత్వంతో ఆయన చర్చిస్తారు. సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనకు తేదీతో పాటు స్థలాన్ని చంద్రబాబు ఖరారు చేయనున్నారు.

  • Loading...

More Telugu News