: సాంబా సెక్టార్ లో కాల్పులు... కాశ్మీర్ లో చిక్కుకుపోయిన తెలుగు టూరిస్టులు


కాశ్మీర్ విహార యాత్రకు వెళ్లిన తెలుగు ప్రజలు అక్కడే చిక్కుకుపోయారు. నేటి ఉదయం రోడ్డుపైనే వారి వాహనం నిలిచిపోగా, సాయం కోసం వారు ఎదురుచూస్తున్నారు. అక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరతామన్న విషయం తెలియక అయోమయంలో వున్నారు. వివరాల్లోకెళితే, నేటి ఉదయం సాంబా సెక్టార్ లోని జంగిల్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి దిగారు. దీంతో భారత సైన్యం ఉగ్రవాదులపై ఎదురు కాల్పులకు దిగింది. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ- పఠాన్ కోట్ ల మధ్య జాతీయ రహదారిని సైన్యం మూసేసింది. అదే సమయంలో శ్రీనగర్ నుంచి జమ్మూ బయలుదేరిన తెలుగు యాత్రికుల వాహనాన్ని బనిహాల్ కు 30 కిలో మీటర్ల దూరంలో సైన్యం నిలిపేసింది. దీంతో ఉదయం నుంచి తెలుగు యాత్రికులు అక్కడే పడిగాపులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News