: నాకు రాజకీయాలు తెలియవు: రాజేంద్రప్రసాద్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి నటకిరీటి రాజేంద్రప్రసాద్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు మెగా వర్గం మద్దతిస్తోంది. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ ఈ మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు రాజకీయాలు తెలియవని అన్నారు. అందుకే తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు. కాగా, 'మా' అధ్యక్ష పదవి కోసం రాజేంద్రప్రసాద్ కు పోటీగా సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బరిలో దిగారు. ఆమె అభ్యర్థిత్వాన్ని 'మా' ప్రస్తుత అధ్యక్షుడు, ఎంపీ మురళీమోహన్ బలపరుస్తున్నారు.