: పేదల కడుపు నిండినప్పుడే నిజమైన పండుగ: ఉగాది వేడుకల్లో కేసీఆర్
పేదల కడుపు నిండిన నాడే నిజమైన పండుగ అని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. మన్మథ నామ ఉగాదిని పురస్కరించుకుని నేటి ఉదయం హైదరాబాదులోని రవీంధ్రభారతిలో జరిగిన వేడుకల్లో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రం అన్ని రంగాల్లో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ది సాధించనుందన్నారు. ప్రపంచంలోనే మెరుగైన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చామన్న ఆయన, రానున్న కాలంలో ప్రపంచంలోని అగ్రగామి కంపెనీలు రాష్ట్రానికి భారీ పెట్టుబడులతో వస్తాయని చెప్పారు. నిరుద్యోగులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇకపై రాష్ట్రంలో విద్యుత్ ఇబ్బందులు రాకుండా చూస్తామని ఆయన ప్రకటించారు.