: వైసీపీ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుక... విజయమ్మ, జగన్ ప్రత్యేక పూజలు
మన్మథ నామ ఉగాదిని పురస్కరించుకుని నేటి ఉదయం హైదరాబాదులోని వైసీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు జరిగాయి. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలతో పాటు పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. వేడుకల్లో భాగంగా విజయమ్మ, జగన్ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేడుకలకు హాజరైన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఉగాది పచ్చడిని అందజేశారు. వేడుకల్లో భాగంగా మారేపల్లి రామచంద్ర శాస్త్రి పంచాంగ శ్రవణం వినిపించారు.