: ‘నాడు-నేడు’లో నవ్యాంధ్ర రాజధాని గ్రామాల చరిత్ర... ఉగాది వేడుకల్లో చంద్రబాబు ఆవిష్కరణ
నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా తమ రూపు మార్చుకోనున్న తుళ్లూరు పరిసర గ్రామాల చరిత్ర గ్రంథస్థమైంది. ‘నాడు-నేడు’ పేరిట రూపుదిద్దుకున్న పుస్తకంలో ఏపీ సర్కారు సదరు గ్రామాల చరిత్రను తర్వాతి తరాలకు అందించనుంది. మన్మథ నామ ఉగాదిని పురస్కరించుకుని తుళ్లూరు మండలం అనంతవరంలో జరిగిన వేడుకల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సదరు పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా కొత్తగా రూపుదిద్దుకున్న కూచిపూడి వెబ్ సైట్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఏపీ జర్నలిస్టు సంఘం రూపొందించిన డైరీని కూడా సీఎం విడుదల చేశారు.