: గేల్ నిష్క్రమణ... ఓటమి దిశగా విండీస్!
వరల్డ్ కప్ నుంచి కరీబియన్లు నిష్క్రమించక తప్పదేమో. వెల్లింగ్టన్ లో జరుగుతున్న చివరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు పరాజయం దిశగా సాగుతోంది. తొలి పది ఓవర్లలోనే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన ఆ జట్టును ఆదుకుంటాడనుకున్న సుడిగాలి క్రిస్ గేల్ (61) ఔటయ్యాడు. క్రీజులో ఉన్నంతసేపు ధాటిగానే బ్యాటింగ్ చేసిన అతడిని జట్టు స్కోరు 120 పరుగులు చేరగానే కివీస్ బౌలర్ అడం మిల్నే క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో విండీస్ ఐదో వికెట్ ను కోల్పోయి మరింత కష్టాల్లో పడిపోయింది. 20 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి విండీస్ జట్టు 160 పరుగులు చేసింది.