: సంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలు... రెండు తెలుగు రాష్ట్రాల్లో పంచాంగ శ్రవణం
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు కొద్దిసేపటి క్రితం ఘనంగా ప్రారంభమయ్యాయి. అధికారికంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఇద్దరు సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ పాలుపంచుకున్నారు. గుంటూరు జిల్లా అనంతవరంలో జరుగుతున్న ఏపీ అధికారిక వేడుకలకు చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు, స్పీకర్ కోడెల శివప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఇక హైదరాబాదులోని రవీంద్రభారతిలో ప్రారంభమైన తెలంగాణ వేడుకలకు సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రివర్గ సభ్యులు హాజరయ్యారు. రెండు చోట్ల పంచాంగ శ్రవణం జరుగుతోంది. ఈ వేడుకలకు ప్రజలు భారీగా తరలివచ్చారు.