: దంచికొట్టిన గప్టిల్... 111 బంతుల్లో సెంచరీ.. డబుల్ సెంచరీకి చేరువలో కివీస్ స్కోరు


వరల్డ్ కప్ చివరి క్వార్టర్ ఫైనల్ లో న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్(12) నిరాశపరిచినా, ఆ జట్టు ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (100) చెలరేగాడు. 111 బంతుల్లో 12 ఫోర్లతో విరుచుకుపడి సెంచరీ సాధించిన అతడు జట్టు స్కోరును పరుగులు పెట్టిస్తున్నాడు. ఆదిలోనే బ్రెండన్, ఆ తర్వాత విలియమ్సన్ (33) వికెట్లు పడినా, ఏమాత్రం వెనకడుగు వేయని గప్టిల్, విండీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. 35 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి కివీస్ జట్టు 187 పరుగులు చేసి డబుల్ సెంచరీకి చేరువైంది. రెండో ఎండ్ లో రాస్ టేలర్ (36) కూడా నిలకడగానే రాణిస్తున్నాడు.

  • Loading...

More Telugu News