: హాస్టల్ లో వసతుల లేమిపై విద్యార్థుల వీరంగం... శ్రీ చైతన్య కళాశాలలో ఉద్రిక్తత


హాస్టల్ లో సరైన వసతులు లేవని ఆరోపిస్తూ, విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు అదుపు తప్పారు. కళాశాల వసతి గృహంపై దాడికి దిగారు. హాస్టల్ లోని కంప్యూటర్లు, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. అనంతరం వాటికి నిప్పు పెట్టారు. రంగప్రవేశం చేసిన పోలీసులు విద్యార్థులను అదుపు చేసే క్రమంలో లాఠీచార్జీ జరిపారు. దీంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇదేదో ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంక్షేమ శాఖ వసతి గృహంలో జరిగిన ఘటన కాదు. వేలకు వేలు ఫీజులు కట్టించుకుని విద్యాబోధన కొనసాగిస్తున్న కార్పొరేట్ కళాశాలలో చోటుచేసుకున్న అరుదైన ఘటన. హైదరాబాదు శివారు నిజాంపేటలోని శ్రీచైతన్య కళాశాలలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థుల ఆందోళన, పోలీసుల లాఠీచార్జీ నేపథ్యంలో కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News