: అంతటి విద్వాంసుడు కూడా గజల్ శ్రీనివాస్ అభిమానే!
కర్నాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. సంగీతాన్ని వరంలా పొందిన వ్యక్తి ఆయన. అంతటి మహానుభావుడికి పాలకొల్లులో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను గజల్ శ్రీనివాస్ అభిమానిని అని తెలిపారు. ఆయనతో పరిచయం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తాను శ్రీనివాస్ లా గజల్స్ పాడలేనని, ఆయన మంచి పనులు చేస్తున్నారని కితాబిచ్చారు. కాగా, సన్మానం సందర్భంగా మంగళంపల్లిని గుర్రాలు పూన్చిన రథంలో పాలకొల్లు వీధుల్లో ఊరేగించడం విశేషం. గజల్ చారిటబుల్ ట్రస్టు, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో ఈ సన్మానం జరిగింది.