: చిక్కుల్లో పడ్డ 'ఫైర్ బ్రాండ్' రేణుకాచౌదరి!
రాజకీయ వర్గాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి చిక్కుల్లో పడింది. రేణుకాచౌదరి తనను రూ.కోటి పది లక్షల మేర మోసం చేశారని భూక్యా రాంజీ అనే వ్యక్తి భార్య హైకోర్టుకు వెళ్లారు. ఖమ్మం జిల్లా వైరా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ ఇప్పిస్తానని మోసం చేశారని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రేణుకాచౌదరిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో, ఖమ్మం పోలీసులు రేణుకపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.