: అందరూ గుర్తుంచుకోండి... సినిమా రంగం పుట్టింది ఆంధ్రాలోనే: దిల్ రాజు
ప్రముఖ నిర్మాత, తెలంగాణ మూవీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పెద్దలు ఈ సాయంత్రం తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ను కలిశారు. అనేక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ... తాను తెలంగాణ వాడినైనా తన ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. అదే సమయంలో, సినిమా రంగం పుట్టింది ఆంధ్రాలోనే అన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. సినిమా రంగంలో ఎదగాలంటే ప్రతిభ, విషయ పరిజ్ఞానం తప్పక అవసరమని అన్నారు. ఇక, ఎర్ర చిత్రాల దర్శకుడు ఆర్.నారాయణమూర్తి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. రాష్ట్రం రెండు ముక్కలైంది కాబట్టి, చిత్రసీమ కూడా విడిపోవాలని అన్నారు.