: ఇండియన్ రైల్వేస్ కు కొండముచ్చుల సాయం!
కొన్ని రైల్వే స్టేషన్లలో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. తినే ఆహార పదార్థాలను అమాంతం లాగేసుకుని వెళ్లిపోతాయి. అదలిస్తే పళ్లు బయటపెట్టి భయపెట్టేందుకు ప్రయత్నిస్తాయి. కొన్నిసార్లు విద్యుత్ లైన్లకు తగిలి మరణించడంతో, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి రైళ్ల ఆలస్యమవుతున్నాయి. ఇప్పుడు భారత రైల్వే శాఖ అందుకు విరుగుడు కనిపెట్టింది. కోతులను పారదోలేందుకు కొండముచ్చులను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. ఆగ్రా డివిజన్ లో కోతుల కారణంగా సమస్యలెదుర్కొంటున్న నాలుగు ప్రధాన స్టేషన్లలో ఈ కొండముచ్చులను మోహరించనుంది. ఏడాదికి రూ.9 లక్షలు చెల్లించే విధంగా కొండముచ్చులు కలిగి ఉన్న వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకుంది రైల్వే శాఖ. ప్రజలు కూడా కోతుల పట్ల ఫిర్యాదులు చేస్తుండడంతో, యమునా నదీ తీరాన ఓ వానర సంరక్షణ కేంద్రం నిర్మించేందుకు అక్కడి అధికారులు అనుమతి పొందారు.