: దుబాయ్ లో 'జీ తెలుగు' తారల హంగామా


తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా జీ తెలుగు చానల్ తన ప్రేక్షకులకు పూర్తి ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాన్ని అందించబోతోంది. మన్మథనామ సంవత్సర కానుకగా జీ తెలుగు తారలు దుబాయ్ గడ్డపై చేసిన హంగామాను ప్రసారం చేయనుంది. సుమారు 20 మంది తారలతో జీ తెలుగు చేసిన సందడిని మార్చి 22న, మార్చి 29న మధ్యాహ్నం 3 గంటలకు రెండు భాగాలుగా ప్రసారం చేయనుంది. దుబాయ్ లోని అందమైన లొకేషన్స్ లో వీరంతా ఆటపాటలతో అలరించారు. కౌశిక్, అలీ, స్నేహ, నిరుపమ్, సమీర, ప్రభాకర్, నిత్య, ప్రదీప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. స్థానిక నర్తకి చేసిన బెల్లీ డ్యాన్స్ ను కూడా ఈ కార్యక్రమంలో చూపించబోతున్నారు.

  • Loading...

More Telugu News