: రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలు... కడప జిల్లాలో దారుణం
కడప జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు యువతులు, ఇద్దరు చిన్నారులు రైలు పట్టాలపై విగత జీవులుగా కనిపించారు. ఈ ఘటన కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం చెన్నరాజుపోడు గేటు సమీపంలో జరిగింది. మండలంలోని వైకోట గ్రామానికి చెందిన మణెమ్మ (25), అరుణమ్మ (28), వారి పిల్లలు పావని (4), హరిత (3)లు శుక్రవారం నాడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైలు పట్టాలపై వీరి మృత దేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ కలహాలే సామూహిక ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు.