: ‘బేబి’ కోసం ముంబై పోలీసుల ముమ్మర గాలింపు!


ముంబై పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న ఆ ‘బేబి’ చిన్న పాపాయేమీ కాదు. యువతను మత్తులో ముంచి కోట్లు గడిస్తున్న మహా మాయలేడి. శశికళ పతంకర్ అలియాస్ బేబి కోసం మహారాష్ట్ర పోలీసులతో పాటు యాంటీ నార్కోటిక్స్ సెల్ (ఏఎన్సీ), నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు(ఎన్సీబీ)లు సంయుక్తంగా సోదాలు జరుపుతున్నా, ఆమె జాడ దొరకడం లేదట. ముంబైలో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ లో బేబి కాకలు తీరిన బంటట. ముంబైలోని వర్లీ ప్రాంతానికి చెందిన సిద్దార్థ నగర్ లోని మురికివాడను కేంద్రంగా చేసుకున్న బేబి, పోలీసులకు ఏమాత్రం చిక్కకుండా తన కార్యకలాపాలను యథేచ్ఛగా సాగిస్తోందట. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న బేబికి ముంబై పోలీసు శాఖలో మంచి మిత్రులు కూడా ఉన్నారట. వారి సహయ సహకారాలతోనే బేబి తప్పించుకుని తిరుగుతోందట. మొన్నటికి మొన్న ఇంటిలోనే కాక పోలీస్ స్టేషన్ లోని తన లాకర్ లోనూ భారీ ఎత్తున డ్రగ్స్ ను కలిగి ఉన్న కారణంగా పట్టుబడ్డ కానిస్టేబుల్ కూడా బేబి మిత్రుడేనట. ఐదుగురు సోదరుల ముద్దుల చెల్లెలైన బేబి, తన అన్నల బాటలోనే నడుస్తోందని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. బేబి సోదరులందరిపైనా హత్య నేరాలకు సంబంధించిన కేసులున్నాయట.

  • Loading...

More Telugu News