: విఫలమైన పాక్... పట్టుబిగించిన ఆస్ట్రేలియా... విజయ లక్ష్యం 214 పరుగులే!


పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ లో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ పోరులో భారీ స్కోర్ చేయడంలో విఫలమైన పాక్ జట్టు, ఆస్ట్రేలియా ముందు 214 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. హారిస్ సొహైల్ (41) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అంతకుముందు 24 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన పాక్ ను హారిస్, మిస్బా కాస్తంత ఆదుకున్నారు. వీరిద్దరూ కలసి మూడో వికెట్ కు 79 పరుగులు (109 బంతుల్లో) జోడించారు. మిస్బా అవుటైన తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లు వరుసగా వికెట్లు తీసి పట్టు బిగించారు. పాక్ జట్టులో మిస్బా 34, మక్సూద్ 29, ఆఫ్రిది 23 ఉమర్ అక్మల్ 20, రియాజ్ 16, ఇషాన్ 15, సర్ఫరాజ్ అహ్మద్ 10, అహ్మద్ షెహజాద్ 5 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్ వుడ్ 4 వికెట్లు పడగొట్టి రాణించగా, స్టార్క్, మ్యాక్స్ వెల్ చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. మరికాసేపట్లో 214 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు దిగనుంది. పాక్ బౌలర్లు అద్భుతం చేయకుంటే ఇంటిదారి పట్టడం ఖాయమే!

  • Loading...

More Telugu News