: తప్పుడు నిర్ణయాలతో ఓడిపోయాం... పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్న బంగ్లాదేశ్
ఇండియాతో జరిగిన పోరులో ఘోర పరాజయాన్ని బంగ్లాదేశ్ జట్టు జీర్ణించుకోలేకపోతోంది. అంపైర్ల తప్పుడు నిర్ణయాలు తమను ఓడించాయని ఆటగాళ్లు భావిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్థానీ అంపైర్ అలీందార్ పలు నిర్ణయాలు తప్పుగా ఇచ్చాడని, అవే తమ విజయావకాశాలను దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలీందార్ పై ఫిర్యాదు చేయాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ గా మారిందని స్వయంగా ఐసీసీ అధ్యక్షుడు ముస్తాఫా కమల్ విమర్శించారు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. కాగా, కమల్ వ్యాఖ్యలను బీసీసీఐ ఖండించింది.