: రాయ్ బరేలీలో ఘోర రైలు ప్రమాదం... పట్టాలు తప్పిన జనతా ఎక్స్ ప్రెస్, 15 మంది మృతి


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీలో కొద్దిసేపటి క్రితం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రాయ్ బరేలీ సమీపంలో డెహ్రాడూన్-వారణాసి జనతా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. మరో 12 మందికి గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం. రాయ్ బరేలీ జిల్లాలోని బచ్రాన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించాయి.

  • Loading...

More Telugu News