: టీఆర్ఎస్ కు ఓట్ల కోసం మద్యం, డబ్బు పంచుతున్న ఉన్నతాధికారులు: ఈసీకి బీజేపీ ఫిర్యాదు


తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందట. తమ అభ్యర్థులకు ఓట్లను వేయించాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేస్తోందట. అధికార పార్టీ చెప్పిందే వేదంలా పరిగణిస్తున్న ఉన్నతాధికారులు కూడా పట్టభద్రులను ప్రలోభాలకు గురిచేసేందుకు రంగంలోకి దిగారట. ఈ మేరకు నిన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ పురమాయించడంతో పలు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు తమ కింద పనిచేస్తున్న పట్టభద్రులైన ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకు చర్యలు ప్రారంభించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారు. సదరు ప్రలోభాలకు గురి చేస్తున్న ఉన్నతాధికారుల జాబితాను కూడా ఇంద్రసేనారెడ్డి ఈసీకి అందించారు.

  • Loading...

More Telugu News