: విజయమో, వీరస్వర్గమో... మధ్యలోనే నిష్క్రమిస్తే ఎలా?: జగన్ వైఖరిపై టీడీపీ నేత యామిని బాల


వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రభుత్వ విప్, టీడీపీ నేత యామిని బాల కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ, నిన్న సభ నుంచి వాకౌట్ చేసిన జగన్ తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. యుద్ధంలోకి దిగిన రాజు విజయమో, వీర స్వర్గమో తేల్చుకుంటారని ఆమె అన్నారు. అయితే అందుకు విరుద్ధంగా జగన్ మధ్యలోనే తన పోరును విరమించుకున్నారని దెప్పిపొడిచారు. జగన్ చేస్తున్న యుద్ధాన్ని ఏమనాలో కూడా తెలియడం లేదని, నిన్నటి అసంబద్ధ నిర్ణయంతోనే జగన్ వ్యక్తిత్వం ఏమిటో తెలిసిపోతోందని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చ జరిగితే ప్రజలు హర్షిస్తారన్న ఆమె, ఆ దిశగా వైసీపీ సాగడం లేదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News