: ఆసీస్ పదునైన బంతులకు పాక్ బ్యాట్స్ మెన్ బెంబేలు... రెండు వికెట్లు కోల్పోయిన పాక్


అడిలైడ్ లో కొద్దిసేపటి క్రితం మొదలైన మ్యాచ్ లో ఆసీస్ బౌలర్లు పదునైన బంతులతో విరుచుకుపడుతున్నారు. దీంతో పాక్ బ్యాట్స్ మెన్ బెంబేలెత్తిపోతున్నారు. ఐదు, ఆరో ఓవర్లలో వరుసగా పాక్ ఓపెనర్లు పెవిలియన్ బాట పట్టారు. జట్టు స్కోరు 20 పరుగులకు చేరగానే తొలి వికెట్ కోల్పోయిన పాక్, మరో నాలుగు పరుగులు చేసి రెండో వికెట్ ను కోల్పోయింది. పాక్ స్టార్ బ్యాట్స్ మన్ గా వెలుగొందుతున్న సర్ఫరాజ్ అహ్మద్ (10) మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో షేన్ వాట్సన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వెనువెంటనే అహ్మద్ సెహజాద్ (5) కూడా జోస్ హ్యాజిల్ వుడ్ బౌలింగ్ లో క్లార్క్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • Loading...

More Telugu News