: సైనిక దుస్తుల్లో వచ్చి... ఉగ్రవాదుల దొంగ దెబ్బ: కాశ్మీర్ లో ముగ్గురు పోలీసుల మృతి


పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులు దొంగ దెబ్బ తీశారు. జమ్మూ కాశ్మీర్ లోని రాజ్ బాగ్ పోలీస్ స్టేషన్ పై మెరుపు దాడి చేశారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు భారత బలగాలపై దొంగ దెబ్బ తీశారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు మరణించారు. ఉగ్రవాదుల దాడితో వేగంగా స్పందించిన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ప్రస్తుతం అక్కడ ఇరువర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News