: ప్రేమ జంట ఆచూకీ కోసం యువకులకు బడితె పూజ... పత్తికొండ పోలీసుల ఓవరాక్షన్!


తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల ఓవరాక్షన్ నానాటికీ మితిమీరుతోంది. మొన్న కృష్ణా జిల్లా, నిన్న మెదక్ జిల్లా... పోలీసుల చిత్రహింసలకు తాళలేక ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. ఈ రెండు ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. సదరు ఘటనలకు బాధ్యులైన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలూ తీసుకున్నారు. ఈ ఘటనలు జనం మది నుంచి పూర్తిగా కనుమరుగు కాకముందే, కర్నూలు జిల్లా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. జిల్లాలోని పత్తికొండ పోలీస్ స్టేషన్ ఖాకీలు ఏకంగా నలుగురు యువకులను చితకబాదారు. సదరు పోలీసుల లాఠీల దెబ్బలు రుచి చూసిన యువకులు నేరమేమీ చేయలేదు. స్థానికంగా ఓ ప్రేమజంట అదృశ్యం కాగా, వారి ఆచూకీ కోసం ఈ నలుగురిని పోలీసులు చితకబాదారు. విచారణ పేరిట పోలీస్ స్టేషన్ కు పిలిచిన స్టేషన్ ఎస్సై శ్రీనివాసులు, మరో కానిస్టేబుల్ తో కలిసి నలుగురిని స్టేషన్ లోని సెల్ లో వేసి లాఠీలతో కుళ్లబొడిచేశారు. పోలీసుల లాఠీ దెబ్బలతో యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

  • Loading...

More Telugu News