: ఉత్తమ గ్లోబల్ లీడర్ల జాబితాలో మోదీదే అగ్రస్థానం


ఉత్తమ గ్లోబల్ లీడర్ల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. చైనా ఇంటర్నేషనల్ పబ్లిక్ గ్రూప్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశీయ, విదేశీ వ్యవహారాలను చక్కబెట్టడంలో మోదీకి తిరుగులేదని ఈ సర్వే వెల్లడించింది. ఈ జాబితాలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రెండవ స్థానంలో నిలిచారు. కాగా, ఎక్కువ మందికి తెలిసిన దేశాధినేతల జాబితాలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అగ్రస్ధానంలో నిలిచారు. ఆయన తరువాతి స్థానాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమెరాన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నిలిచారు.

  • Loading...

More Telugu News