: మీరూ ట్రై చేస్తారా!... ఇదో 'తియ్యని' ఉద్యోగం!


ప్రపంచంలో ప్రముఖ కన్ఫెక్షనరీ సంస్థగా 'స్విజిల్స్-మాట్లో' కు పేరుంది. బ్రిటన్ కు చెందిన ఈ తినుబండారాల తయారీ సంస్థ ఇప్పుడు ఓ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అందుకు 16 ఏళ్లు పైబడినవారు అర్హులట. వృద్ధులైనా 'నో ప్రాబ్లం'... అప్లై చేయొచ్చు. రకరకాల స్వీట్లు లాగించిన అనుభవం ఉంటే చాలు. స్వీట్లంటే ఎందుకు ఇష్టమో 500 పదాలు దాటకుంటా వివరించాలి. లేదా, వివరణతో కూడిన వీడియో కూడా పంపొచ్చు. ఏప్రిల్ 30లోగా దరఖాస్తులు పంపాలట. అయితే, ఈ ఉద్యోగం ఏడాది పాటు మాత్రమే ఉంటుంది. ఈ మేరకు ముందే కాంట్రాక్టుపై సంతకం చేయించుకుంటారు. అయితేనేం, మంచి అనుభవం దక్కుతుంది. అంతేగాదు, ఆ సంవత్సరమంతా స్వీట్లు ఉచితం. ఒక స్వీటుకు మరో స్వీటుకు రుచిలో ఉన్న తేడాను గుర్తించడమే ఈ ఉద్యోగంలో ప్రధాన విధి. ఇంకెందుకాలస్యం... ఆసక్తి ఉంటే మీరూ ట్రై చేయండి!

  • Loading...

More Telugu News